muralu mohan: వేంకటేశ్వరుడిని 'వెంకన్న చౌదరి' అని కావాలని అనలేదు: మురళీ మోహన్ వివరణ

  • బుచ్చయ్య చౌదరి పక్కన కూర్చొని ఆయనతో మాట్లాడాను
  • దీంతో నోటి వెంట 'వెంకన్న చౌదరి' అన్న పదం వచ్చింది 
  • దేవుడికి కులాన్ని అంటగట్టేంత తెలివితక్కువ వాడిని కాదు
  • అసలు కులాలు అనే దానిపై కూడా నాకు నమ్మకం లేదు

రాజమహేంద్రవరంలో నిన్న జరిగిన మినీ మహానాడులో తాను పొరపాటుగా తిరుమల శ్రీవారిని 'వెంకన్న చౌదరి' అని అన్నానని టీడీపీ ఎంపీ మురళీ మోహన్‌ అన్నారు. వేంకటేశ్వర స్వామికి కూడా కులాన్ని ఆపాదిస్తూ మురళీ మోహన్‌ వ్యాఖ్యానించారని, అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో దీనిపై ఆయన స్పందించారు.

తాను అప్పటివరకు మంత్రి బుచ్చయ్య చౌదరి పక్కన కూర్చుని ఆయనతో మాట్లాడడంతో తన నోటి వెంట 'వెంకన్న చౌదరి' అన్న పదం వచ్చిందని మురళీ మోహన్‌ అన్నారు. తాను దేవుడికి కులాన్ని అంటగట్టేంత తెలివితక్కువ వాడిని కాదని పేర్కొన్నారు. తనకి అసలు కులాలు అనే దానిపై కూడా నమ్మకం లేదని, అటువంటిది ఉద్దేశ పూర్వకంగా శ్రీవారిని ఎలా అంటానని ప్రశ్నించారు. ఈ మాట తన నోటి నుంచి పొరపాటుగా వచ్చిందని, తాను ఈ రోజు దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు కూడా దేవుడి ఫొటోకి చెప్పుకున్నానని వ్యాఖ్యానించారు.     

More Telugu News