sensex: రెండో రోజూ రంకెలు వేసిన బుల్.. కొనసాగిన మార్కెట్ల జోరు

  • ఐటీ, బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్లతో లాభాలను నమోదు చేసిన మార్కెట్లు
  • 262 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 10,605కు చేరుకున్న నిఫ్టీ

భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో కూడా జోరును కొనసాగించాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు ఉండటంతో పాటు... ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ఈరోజు ఆద్యంతం సూచీలు లాభాల్లోనే కొనసాగాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 262 పాయింట్లు పుంజుకుని 34,925కు చేరుకుంది. నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 10,605కి ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
గేట్ వే డిస్ట్రిపార్క్స్ (19.99%), టైమ్ టెక్నోప్లాస్ట్ లిమిటెడ్ (14.56%), ఎంసీఎక్స్ (13.79%), ఐఎఫ్సీఐ లిమిటెడ్ (11.87%), హ్యాథ్ వే కేబుల్ అండ్ డేటా (9.30%).

టాప్ లూజర్స్:
గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ (-4.39%), శోభా లిమిటెడ్ (-3.98%), రాజేష్ ఎక్స్ పోర్ట్స్ (-3.46%), జీఈ టీ అండ్ డీ ఇండియా (-3.14%), ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ (-3.13%).     

More Telugu News