ntr: ఏ సంగీత దర్శకుడికైనా ఇది డ్రీమ్ టీమ్: తమన్

  • త్రివిక్రమ్ తో సెట్స్ పై ఎన్టీఆర్
  • బాణీలు కడుతోన్న తమన్ 
  • సాహిత్యాన్ని అందిస్తోన్న సిరివెన్నెల    

ఎన్టీఆర్ .. పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతుండగా, సాహిత్యాన్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి అందిస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన పనుల నేపథ్యంలోనే త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ .. తమన్ .. సిరివెన్నెల కలుసుకున్నారు. సంగీత సాహిత్యాల పరంగా అవుట్ పుట్ గురించి మాట్లాడుకున్న తరువాత సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఆ సమయంలో తీసిన ఫోటోను తమన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఏ సంగీత దర్శకుడికైనా ఇది డ్రీమ్ టీమ్ అంటూ కామెంట్ పెట్టాడు. యాక్షన్ పాళ్లు ఎక్కువగా కలిపేసి రూపొందిస్తోన్న ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.    

More Telugu News