Virat Kohli: రాకెట్ ఇంధనంతో కోహ్లీని ఆడించలేం: రవిశాస్త్రి

  • కోహ్లీ కూడా మనిషే.. యంత్రం కాదన్న శాస్త్రి
  • ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ మెడకు గాయం
  • దీంతో, కౌంటీల నుంచి తప్పుకున్న కోహ్లీ

మెడకు సంబంధించిన గాయం కారణంగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడాలనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కల నెరవేరలేదు. సర్రే టీమ్ నుంచి ఆయన తప్పుకున్నాడు. కోహ్లీ నిర్ణయంతో భారతీయ అభిమానులే కాకుండా, కోహ్లీ ఆటను ఆస్వాదించాలనుకున్న ఇంగ్లండ్ లోని అభిమానులు కూడా నిరాశకు గురయ్యారు. ఈ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ, కోహ్లీ యంత్రం కాదని, ఆయన కూడా ఒక మనిషే అని గుర్తుపెట్టుకోవాలని చెప్పాడు. రాకెట్ ఇంధనాన్ని ఉపయోగించి మైదానంలో కోహ్లీని ఆడించలేమని అన్నాడు.

ఈనెల 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఫీల్డింగ్ సందర్భంగా కోహ్లీ గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విరాట్ మెడకు గాయం అయింది. జూన్ 15వ తేదీన బెంగళూరులో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీలో కోహ్లీ ఫిట్ నెస్ టెస్టుకు హాజరుకానున్నాడు. అక్కడ ఫిట్ నెస్ ను నిరూపించుకుంటే... ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్ కు టీమిండియాతో కలిసి బయల్దేరుతాడు.

More Telugu News