karnataka: ఏ పార్టీకి ప్రజలు సంపూర్ణ మెజార్టీ ఇవ్వలేదు: బలపరీక్ష సందర్భంగా కుమారస్వామి

  • కర్ణాటకకు హంగ్ అసెంబ్లీ కొత్తేమీ కారు
  • రాష్ట్ర సంక్షేమం కోసమే కాంగ్రెస్, జేడీఎస్ కూటమి
  • అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు

కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, కర్ణాటక ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్ తో కలసి జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే విశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెట్టామని అన్నారు. ప్రజలకు మంచి పాలన అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర సంక్షేమం కోసమే తమ కూటమి ఏర్పడిందని తెలిపారు. హంగ్ అసెంబ్లీ కర్ణాటకకు కొత్తేమీ కాదని... 2004లో కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడిందని చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టే అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

కాసేపట్లో బలపరీక్ష జరగనుంది. కాంగ్రెస్, జేడీఎస్ లకు 116 (ఇద్దరు ఇండిపెండెంట్లు సహా) మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.... బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. బలపరీక్షలో కుమారస్వామి నెగ్గాలంటే మ్యాజిక్ ఫిగర్ 111ను సాధించాల్సి ఉంది. 

More Telugu News