yvs choudari: మళ్లీ రంగంలోకి వైవీఎస్ చౌదరి .. కొత్తవాళ్లతో మూవీ!

  • దర్శక నిర్మాతగా మెప్పించిన వైవీఎస్ 
  • నష్టాల కారణంగా కొంతకాలం దూరం
  • తాజాగా మరో ప్రాజెక్టుకు సన్నాహాలు    

తెలుగు ప్రేక్షకులకు ప్రేమకథా చిత్రాలను .. కుటుంబకథా చిత్రాలను భారీ బడ్జెట్ తో అందించిన దర్శక నిర్మాతల జాబితాలో వైవీఎస్ చౌదరి పేరు కూడా కనిపిస్తుంది. వైవీఎస్ చౌదరి ఆ మధ్య చేసిన సినిమాలు భారీ పరాజయాలను చవి చూశాయి. దాంతో ఆ నష్టాలను తట్టుకోవడం ఆయనకి కష్టమే అయింది. ఈ క్రమంలో కొంతకాలంగా ఆయన సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటూ వచ్చారు.

మళ్లీ తాను రంగంలోకి దిగుతున్నట్టుగా ఆయన తాజాగా ప్రకటించడంతో అందరి దృష్టి ఆ వైపుకు వెళ్లింది. త్వరలోనే తాను ఒక సినిమా చేయబోతున్నాననీ, అంతా కొత్తవాళ్లతోనే ఈ సినిమా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని అన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని చెప్పారు.   

More Telugu News