balakrishna: బాలకృష్ణ .. బోయపాటి సినిమాకి ముహూర్తం ఖరారు

  • వినాయక్ మూవీతో బిజీగా బాలయ్య
  • నెక్స్ట్ ప్రాజెక్టుగా ఎన్టీఆర్ బయోపిక్ 
  • ఆ తరువాత బోయపాటితో మూడవ మూవీ  

బాలకృష్ణ 100వ సినిమానే బోయపాటి శ్రీను చేయవలసి వుంది. చారిత్రక చిత్రం చేయాలని బాలకృష్ణ నిర్ణయించుకోవడం వలన అది కుదరలేదు. ఆ తరువాత కూడా ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీ అయ్యారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా చేయడానికి మళ్లీ ముహూర్తం కుదిరిందనేది తాజా సమాచారం. జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజు .. ఆ రోజున ఈ సినిమాను ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించి, టైటిల్ తో పాటు కథా నేపథ్యం .. కథానాయికలకు సంబంధించిన వివరాలను ఆ రోజున ఎనౌన్స్ చేయనున్నారని అంటున్నారు. ప్రస్తుతం వినాయక్ తో ఓ మూవీ చేస్తోన్న బాలకృష్ణ, ఆ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ పై దృష్టి పెట్టనున్నాడు. ఆ తరువాత బోయపాటితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. బాలకృష్ణ .. బోయపాటి కాంబినేషన్లో 'సింహా' .. 'లెజెండ్' ఘన విజయాల తరువాత రూపొందుతోన్న ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడుతుందేమో చూడాలి.   

More Telugu News