వైసీపీ-జనసేన పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయి!: అశోక్ గజపతిరాజు ఆరోపణ

24-05-2018 Thu 21:40
  • వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే 
  • ‘కాంగ్రెస్’కు పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పడుతుంది 
  • ఆ మూడేళ్లు బొత్స ఎక్కడ?

వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విమర్శలు గుప్పించారు. విజయనగరంలోని ఆనందగజపతి కళాక్షేత్రంలో ఈరోజు నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని అన్నారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పడుతుందని అన్నారు. వైసీపీ-జనసేన పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణపైనా ఆయన విమర్శలు చేశారు. అధికారంపోయిన తర్వాత మూడేళ్లు ఎక్కడున్నారో తెలియని బొత్స, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారం కోసం మళ్లీ బయటకు వస్తున్నారని అన్నారు.