Karnataka: ఈవీఎంలలో అవకతవకలు: కర్ణాటక కొత్త డిప్యూటీ సీఎం

  • కాంగ్రెస్‌ నేతలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఓడారు
  • ఈసీకి ఫిర్యాదు చేస్తాం
  • ఎన్నికలు బాలెట్ పేపర్ల ద్వారానే జరపాలని కోరతాం

కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. రేపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి బలనిరూపణ పరీక్ష ఎదుర్కోనున్నారు. కాగా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్‌ నేత జీ పరమేశ్వర.. ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేశారు. బీజేపీ ఈవీఎంల అవకతవకలకు పాల్పడినట్లు తనతో పాటు తమ నేతలు కొందరు భావిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఎంతో బలంగా ఉన్న కర్ణాటకలోని కొన్ని నియోజక వర్గాల్లోనూ ఓడిపోయారని అన్నారు. తాము త్వరలోనే ఎన్నికల కమిషన్‌కి ఈ విషయమై ఫిర్యాదు చేస్తామని, అలాగే భవిష్యత్తులో అన్ని ఎన్నికలు బాలెట్ పేపర్ల ద్వారానే జరపాలని కోరతామని అన్నారు.

More Telugu News