ఏపీలో టీడీపీ విజయం సాధించకపోతే రాష్ట్రం ముప్పై ఏళ్లు వెనక్కిపోతుంది!: మంత్రి అచ్చెన్నాయుడు

24-05-2018 Thu 18:17
  • రమణదీక్షితులతో ఏ1, ఏ2 లు ఆరోపణలు చేయిస్తున్నారు
  • ప్రధాని మోదీ ఉచ్చులో పవన్ కల్యాణ్ చిక్కుకుపోయారు
  • స్థానిక ఎన్నికల్లో బీజేపీ, ‘జనసేన’తో పొత్తు లేకున్నా మేము గెలుస్తాం

వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించకపోతే ఏపీ రాష్ట్రం ముప్పై ఏళ్లు వెనక్కిపోతుందని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. చిత్తూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఏ1, ఏ2 నిందితులు రమణదీక్షితులతో ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలతో తమకు పొత్తు లేకున్నా టీడీపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఉచ్చులో పవన్ కల్యాణ్ చిక్కుకుపోయారని విమర్శించారు.

కాగా, టీడీపీ ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ, టీటీడీ దేవస్థానంపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. గతంలో ఏడుకొండలు వద్దని, రెండు కొండలు చాలని చెప్పిన వ్యక్తి పంచభూతాల సాక్షిగా గాలిలో కలిసిపోయారని అన్నారు. తిరుమల జోలికొస్తే ప్రధాని మోదీకి కూడా అదేగతి పడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.