tirumala: ఆ వజ్రం వేంకటేశ్వరస్వామిదే అయితే రమణ దీక్షితులు, ఐవైఆర్ ఇద్దరినీ అరెస్ట్ చేయాలి: సుప్రీంకోర్టు న్యాయవాది

  • 2001లో పింక్ డైమండ్ తన సమక్షంలోనే పగిలిపోయిందని రమణ దీక్షితులు చెప్పారు
  • పగిలింది డైమండ్ కాదు.. రూబీ అని ఐవైఆర్ నివేదిక ఇచ్చారు
  • ఇప్పుడు ఎవరైనా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే.. ఇద్దరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి చెందిన పింక్ డైమండ్ ను జెనీవాలో వేలం వేశారనే వార్త నిజమైతే... అప్పట్లో ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులుతో పాటు అప్పటి టీటీడీ ఈవో ఐవైఆర్ కృష్ణారావును కూడా అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ డీవీ రావు అన్నారు. డైమండ్ విదేశాలకు తరలిపోయేలా కస్టమ్స్ అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.

విజయవాడలో ఆయన మాట్లాడుతూ, అర్చకులు కారుణ్య నియామకాలను కోరడంలో తప్పు లేదని... కానీ, రిటైర్మెంట్ తర్వాత వంశపారంపర్యంగా కోరడం సరికాదని చెప్పారు. టీటీడీలో పదవీ విరమణ వయసుకు సంబంధించి గతంలోనే హైకోర్టు తీర్పునిచ్చిందని అన్నారు. 1987, 2012లలో జారీ అయిన జీవోలను ఇప్పుడు సవాల్ చేసే అవకాశమే లేదని చెప్పారు. ఆ జీవోల ప్రకారం 2013లో చాలా మంది రిటైరయ్యారని తెలిపారు.

2001లో గరుడసేవలో తన సమక్షంలోనే పింక్ డైమండ్ పగిలిందని రమణ దీక్షితులు చెప్పారని... పగిలింది డైమండ్ కాదు, రూబీ అని అప్పటి ఈవో ఐవైఆర్ నివేదిక ఇచ్చారని డీవీ రావు అన్నారు. జగన్నాథరావు కమిటీ కూడా ఆ నివేదికను సమర్థించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో, జెనీవాలో వేలం వేసింది శ్రీవారి వజ్రం అని రమణ దీక్షితులు ఇప్పుడు చెబుతుండటంపై ఎవరైనా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే... రమణ దీక్షితులతో పాటు ఐవైఆర్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని అన్నారు. 

More Telugu News