తెలంగాణ మహానాడుకు హాజరైన చంద్రబాబు.. డుమ్మా కొట్టిన మోత్కుపల్లి

24-05-2018 Thu 15:47
  • హైదరాబాదులో ప్రారంభమైన టీడీపీ మహానాడు
  • విజయవాడ నుంచి వచ్చిన చంద్రబాబు
  • టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న నేతలు

హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో తెలంగాణ టీడీపీ మహానాడు ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. వేదికపై చంద్రబాబుకు అటూ ఇటుగా ఎల్.రమణ, దేవేందర్ గౌడ్ లు ఆసీనులయ్యారు. టీటీడీపీ కీలక నేత మోత్కుపల్లి మహానాడుకు డుమ్మా కొట్టారు. ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కూడా మహానాడుకు హాజరుకాలేదు.

మరోవైపు, మహానాడులో వివిధ తీర్మానాలను ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మానాలను ప్రవేశపెట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రసంగాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సాగుతున్నాయి. మరికాసేపట్లో చంద్రబాబు ప్రసంగించనున్నారు.