Congress: డియర్ పీఎం.. నేను మీకు చేస్తున్న ఛాలెంజ్ ఇది!: రాహుల్ గాంధీ

  • కోహ్లీ ఫిట్ నెస్ ఛాలెంజ్ కు అంగీకరించినందుకు సంతోషం
  • ‘ఫ్యుయల్ ఛాలెంజ్’ చేస్తున్నా.. ‘పెట్రో’ ధరలు తగ్గించండి
  • మీ ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తున్నా

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ విసిరిన ఫిట్ నెస్ చాలెంజ్ ని తాను స్వీకరిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ సవాల్ విసిరారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

‘డియర్ పీఎం, విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ ఛాలెంజ్ కు అంగీకరించినందుకు సంతోషం. నేను మీకో ఛాలెంజ్ చేస్తున్నాను. ‘పెట్రో’ ధరలు తగ్గించండి లేకపోతే జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది. ‘పెట్రో’ ధరలు తగ్గించాలని మీపై ఒత్తిడి చేస్తున్నాం. మీ ప్రతిస్పందన కోసం నేను ఎదురుచూస్తున్నాను’ అంటూ ‘ఫ్యుయల్ ఛాలెంజ్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ ట్వీట్ చేశారు.

More Telugu News