TTD: రమణ దీక్షితుల వైఖరికి నిరసనగా.. రేపు టీటీడీ ఉద్యోగుల విధుల బహిష్కరణ

  • తిరుమల పరిపాలన భవనంలో అన్ని ఉద్యోగ సంఘాల భేటీ
  • కీలక నిర్ణయం తీసుకున్న ఉద్యోగులు
  • రేపు ఉదయం 10 నుంచి 11.30 వరకు విధుల బహిష్కరణ

తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితుల తీరుకి నిరసనగా ఇప్పటికే వారు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతోన్న విషయం తెలిసిందే. ఈ రోజు తిరుమల పరిపాలన భవనంలో అన్ని ఉద్యోగ సంఘాలు సమావేశమై కాసేపు చర్చించాయి. రేపు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు విధులు బహిష్కరించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకుని తీర్మానం చేశాయి.

తిరుమలలో ఆలయ పవిత్రతను దిగజార్చేలా రమణ దీక్షితులు ప్రవర్తిస్తున్నారని విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. టీటీడీలో పరిపాలన తీరు బాగోలేదని, అవినీతి జరుగుతోందని, గులాబీ వజ్రం పోయిందని తీవ్ర ఆరోపణలు చేస్తోన్న రమణ దీక్షితులు ఢిల్లీకి సైతం వెళ్లి పలువురు బీజేపీ నేతలతో కూడా చర్చించారు. తిరుమల వ్యవహారాలు ఎన్నడూ లేనంతగా చర్చనీయాంశంగా మారాయి. 

More Telugu News