hafeez sayeed: హఫీజ్ సయీద్ ను వేరే దేశానికి తరలించండి: పాకిస్తాన్ కు చైనా సూచన

  • పశ్చిమాసియాలోని ఓ దేశానికి పంపిస్తే అక్కడే ప్రశాంతంగా జీవిస్తాడు
  • పాక్ ప్రధానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సూచన
  • ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ పై చర్యలకు పాక్ పై ఒత్తిళ్లు

ముంబై మారణ హోమం సూత్ర ధారి, 2008 నవంబర్ దాడి కుట్ర నిందితుడు, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ పై చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్ పై అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిళ్లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అతడ్ని పశ్చిమాసియాలోని ఓ దేశానికి తరలించడం మంచిదని పాకిస్తాన్ కు మిత్ర దేశమైన చైనా సూచించింది. ఏప్రిల్ లో చైనాలో బోవా ఫోరం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రధాని షహీద్ ఖాన్ అబ్బాసీతో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే హఫీజ్ సయీద్ ను వేరే దేశానికి తరలించాలన్న సూచన జిన్ పింగ్ నుంచి వచ్చింది.

పశ్చిమాసియాలో ఓ దేశానికి తరలిస్తే, మిగిలిన శేష జీవితమంతా అతడు అక్కడ ప్రశాంతంగా జీవిస్తాడని చైనా హితవు పలికింది. ఈ సమావేశం 35 నిమిషాలు జరగ్గా, 10 నిమిషాలు హఫీజ్ సయీద్ గురించే మాట్లాడుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అనంతరం పాకిస్తాన్ కు వెళ్లిన తర్వాత ప్రధాని అబ్బాసీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. అబ్బాసీ పదవీకాలం ఈ నెలతో ముగిసిపోతోంది. జూలైలో సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం అతడిపై ఓ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.

More Telugu News