rajani: హైదరాబాద్ లో ఘనంగా జరగనున్న 'కాలా' ప్రీ రిలీజ్ ఫంక్షన్

  • పా రంజిత్ దర్శకత్వంలో 'కాలా'
  • మాఫియా డాన్ గా రజనీకాంత్
  • జూన్ 7వ తేదీన భారీ రిలీజ్

రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో 'కాలా' సినిమా రూపొందింది. ధనుష్ నిర్మించిన ఈ సినిమాలో రజనీ మాఫియా డాన్ గా కనిపించనున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో జూన్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా ఆడియో వేడుకను చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో జరపాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం హైదరాబాద్ 'నోవాటెల్' హోటల్లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకను జరపనున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ స్థాయిలో విడుదల చేస్తోన్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా నానా పటేకర్ కనిపించనుండటం విశేషం. 'కబాలి' తరువాత అదే కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో అందరిలోను అంచనాలు వున్నాయి. ఈ సినిమాతో రజనీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరినట్టేనని అభిమానులు భావిస్తున్నారు.      

More Telugu News