Tirumala: తిరుమలలో ఎన్నడూ లేనంత రద్దీ... దర్శనానికి రెండు రోజుల సమయం... చంద్రబాబు సమీక్ష.. ఆదేశాలు!

  • స్వామి దర్శనానికి 48 గంటల సమయం
  • క్యా కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో కిటకిట
  • సమీక్ష నిర్వహించిన చంద్రబాబు

వేసవి సెలవులు మరో వారంలో ముగియనుండటంతో తిరుమల గిరులు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత రద్దీతో నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గత మూడు రోజులుగా పూర్తిగా నిండివుండగా, స్వామి దర్శనార్థం వస్తున్న భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతూ ఉండటంతో నారాయణగిరి ఉద్యానవనం దాటి క్యూలైన్ కిలోమీటర్ల పొడవుసాగింది. ఈ ఉదయం స్వామి దర్శనానికి వచ్చే వారికి 48 గంటల తరువాతే దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

తిరుమలలో రద్దీపై టీవీ చానళ్లలో వస్తున్న వార్తలను చూసి తెలుసుకున్న చంద్రబాబు, ఈ ఉదయం ప్రత్యేకంగా సమీక్ష జరిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని ఆదేశించారు. రద్దీని ముందుగానే అంచనా వేయాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని, అన్నపానీయాలకు లోటు లేకుండా చూసుకోవాలని అన్నారు. రద్దీ ఎక్కడ ఎక్కువగా ఉందన్న విషయాన్ని రియల్ టైమ్ గవర్నెన్స్ సమాచారంతో పరిశీలిస్తుండాలని అన్నారు. రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు.

More Telugu News