Narendra Modi: విరాట్ కోహ్లీ విసిరిన చాలెంజ్ ని స్వీకరిస్తున్నా... త్వరలోనే నా వీడియో వస్తుంది: నరేంద్ర మోదీ

  • ఫిట్ నెస్ చాలెంజ్ ని స్వీకరిస్తున్నా
  • పూర్తి చేసి వీడియోను పోస్టు చేస్తా
  • ట్విట్టర్ లో నరేంద్ర మోదీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ విసిరిన ఫిట్ నెస్ చాలెంజ్ ని తాను స్వీకరిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను ఉంచారు. "చాలెంజ్ ని అంగీకరిస్తున్నా విరాట్. త్వరలోనే నా సొంత వీడియోను షేర్ చేసుకుంటా" అని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ విసిరిన సవాల్ ను పూర్తి చేసిన కోహ్లీ, ఆ వీడియోను పోస్టు చేస్తూ, నరేంద్ర మోదీ, ధోనీ, అనుష్కలను ట్యాగ్ చేస్తూ, వారికి సవాల్ ను పంపిన సంగతి తెలిసిందే. ఇక తన ముందున్న సవాల్ కు సిద్ధమేనని, దాన్ని పూర్తి చేసి, ఆ వీడియోను షేర్ చేస్తానని మోదీ ట్వీట్ చేశారు. 

More Telugu News