ఇది ఎన్నికల ‘మహానాడు’.. దీనికో ప్రాధాన్యత ఉంది: మంత్రి ప్రత్తిపాటి

23-05-2018 Wed 18:39
  • ఈ ‘మహానాడు’ అద్భుతంగా నిర్వహిస్తాం
  • ఇది ఎన్నికల శంఖారావం 
  • ‘మహానాడు’ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం

విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో మహానాడు ఏర్పాట్లను మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు ఈరోజు పరిశీలించారు. అనంతరం, మీడియాతో ప్రత్తిపాటి మాట్లాడుతూ, ‘ఈ ‘మహానాడు’ అద్భుతంగా నిర్వహిస్తాం. ఇది ఎన్నికల ‘మహానాడు’.. ఎన్నికల శంఖారావం ఇధి. దీనికో ప్రాధాన్యత ఉంది. కనుక, ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్నిరకాల సౌకర్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించడమే కాకుండా పర్యవేక్షిస్తున్నాం’ అన్నారు.

మంత్రి దేవినేని మాట్లాడుతూ, ‘2019 ఎన్నికల శంఖారావానికి..జరగబోయే కురుక్షేత్ర సంగ్రామానికి దశాదిశా నిర్దేశం చేసే ‘మహానాడు’ ఇది. గత నాలుగేళ్లలో ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలను చేశాం. ఈ విషయాన్ని తెలియజేస్తాం. అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా ఈ ‘మహానాడు’లో దశాదిశా నిర్దేశం చేయబోతున్నాం. ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, విదేశాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు’ అని అన్నారు.