Kodandaram: రాబోయే ఎన్నికల్లో నేను కింగ్‌ మేకర్ కాదు.. కింగ్‌గానే నిలుస్తా: ప్రొ.కోదండరామ్‌

  • మా పార్టీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుంది
  • పూర్తి మెజార్టీతో గెలుస్తాం 
  • ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం

రాబోయే ఎన్నికల్లో తాను కింగ్‌ మేకర్ కాదని, కింగ్‌గానే నిలుస్తానని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ అన్నారు. తమ పార్టీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని, తాము పూర్తి మెజార్టీతో గెలుస్తామని పేర్కొన్నారు. ఈ రోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు వెయ్యి ధరఖాస్తులు అందాయని, దరఖాస్తుదారులందరికి ఈ నెల 27న అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.

 తాము ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని కోదండరామ్‌ అన్నారు. కర్ణాటకలో ప్రజల ఆకాంక్షలను జాతీయ పార్టీలు నెరవేర్చలేకపోవడంతోనే ఫలితాలు అలా వచ్చాయని అభిప్రాయపడ్డారు.

More Telugu News