samanta: 'మధురవాణి'గా సమంత మేకింగ్ వీడియో

  • మన్ననలు పొందిన 'మహానటి'
  • 'మధురవాణి' పాత్రకి మంచి మార్కులు 
  • అభిమానులను అలరిస్తోన్న వీడియో

'మహానటి' సినిమాలో సమంత 'మధురవాణి' అనే జర్నలిస్ట్ పాత్రను పోషించింది. ఈ పాత్ర ద్వారానే సావిత్రి జీవితచరిత్రలోకి ప్రేక్షకులు ఎంటరవుతారు. 80ల నాటి వేషధారణలో మధురవాణిగా సమంత చేసిన నటన ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇంతవరకూ సమంత చేసిన విభిన్నమైన పాత్రల్లో ఇది ఒకటిగా నిలిచిపోయింది.

ఈ నేపథ్యంలో సమంత వెర్షన్ కి సంబంధించిన మేకింగ్ వీడియోను తాజాగా వదిలారు. సమంత .. విజయ్ దేవరకొండ కాంబినేషన్లోని సీన్స్ ను చిత్రీకరిస్తున్న సందర్భంలోని షాట్స్ తో ఈ వీడియోను వదిలారు. ఈ వీడియోలోని  విజువల్స్ సరదాగా అనిపిస్తూ .. అలరిస్తున్నాయి. షూటింగ్ జరుగుతోన్న సమయంలో మనం కూడా అక్కడే వున్న అనుభూతిని కలిగిస్తున్నాయి. 

More Telugu News