comio smart phone: రూ.9999కే కోమియో ఎక్స్1 నోట్ స్మార్ట్ ఫోన్

  • 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ
  • 6 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే
  • వెనుక డ్యుయల్ కెమెరాలు

దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి కోమియో ఎక్స్1 నోట్ పేరుతో ఓ కొత్త మొబైల్ విడుదలైంది. దీని ధర రూ.9999. వెనుక భాగంలో 13 మెగాపిక్సల్+5 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరాలు, ముందు భాగంలో 8 మెగా పిక్సల్ కెమెరా, 6 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 2.5 డి కర్వ్ డ్ గ్లాస్, 1.45 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ, ఫేస్ అన్ లాక్ స్పెసిఫికేషన్లు ఉన్నాయి.

ఫ్లిప్ కార్ట్ లో దీని విక్రయాలు జరుగుతాయి. రాయల్ బ్లూ, సన్ రైజ్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. అత్యాధునిక కెమెరా క్వాలిటీ, మంచి వేగం, సెక్యూరిటీ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్ ఈ ఫోన్ సొంతమని కంపెనీ సీఈవో సంజయ్ కలిరోనా తెలిపారు. కస్టమర్లు, డీలర్ల నుంచి వచ్చిన స్పందన ప్రోత్సాహకరంగా ఉందన్నారు.

More Telugu News