lakshmi manchu: 'w/o రామ్' నుంచి లక్ష్మి మంచు ఫస్టులుక్

  • లక్ష్మి మంచు ప్రధాన పాత్రలో 'w/o రామ్'
  • థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • ముఖ్యమైన పాత్రలో శ్రీకాంత్

మొదటి నుంచి కూడా లక్ష్మి మంచు విభిన్నమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. తన పాత్ర కొత్తగా ..  కీలకమైనదిగా వుండేలా ఆమె చూసుకుంటూ వుంటారు. అలా తాజాగా ఆమె చేసిన చిత్రమే ''w/o రామ్'. తాను ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా నుంచి కొంత సేపటి క్రితం ఆమె ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

 మోపెడ్ పై వెళుతూ ఏదో విషయాన్ని అన్వేషిస్తున్నట్టుగా ఈ పోస్టర్లో మంచు లక్ష్మి కనిపిస్తోంది. థ్రిల్లర్ నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాలో ఆమె 'దీక్ష' పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్స్ కి రానున్నట్టుగా ఆమె చెప్పారు. ఆదర్శ్ బాలకృష్ణ ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా, కీలకమైన పాత్రలో హీరో శ్రీకాంత్ కనిపించనున్నారు. కొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమా లక్ష్మి మంచు క్రేజ్ ను మరింత పెంచడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.   

More Telugu News