Shruti Hassan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రవితేజతో జోడీ కడుతున్న శ్రుతి హాసన్ 
  • అల్లరి  నరేశ్ కోసం ఫన్ టైటిల్ 
  • ఆగిపోయిన రామ్ సినిమా!  

*  గతంలో 'బలుపు' సినిమాలో కలిసి నటించిన రవితేజ, శ్రుతి హాసన్ మరోసారి జత కడుతున్నారు. 'కందిరీగ' ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తమిళ హిట్ సినిమా 'తేరి'ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా శ్రుతిహాసన్ ను తీసుకున్నట్టు సమాచారం.
*  అల్లరి నరేశ్ హీరోగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందుతోంది. ఈ చిత్రానికి తాజాగా 'ఫన్ రాజా ఫన్' అనే టైటిల్ని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రముఖ హాస్య నటుడు సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.        
*  రామ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో స్రవంతీ మూవీస్ ఓ భారీ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి విదితమే. అయితే, ఈ చిత్రం బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని చిత్ర నిర్మాత ఈ ప్రాజక్టును కేన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది.దీంతో దర్శకుడు మరో నిర్మాత కోసం చూస్తున్నాడట.

More Telugu News