Amitabh Bachchan: అమితాబ్ తో కలసి నటించిన కూతురు శ్వేతాబచ్చన్!

  • ఓ వాణిజ్య ప్రకటనలో నటించిన శ్వేతాబచ్చన్
  • అమితాబ్ వృద్ధుడిగా, సాధారణ మహిళగా శ్వేత 
  • జులై నుంచి ప్రసారం కానున్న ప్రకటన

బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ కుటుంబం నుంచి మరో వ్యక్తి కెమెరా ముందుకు వచ్చారు. అమితాబ్ కూతురు శ్వేతాబచ్చన్ తన తండ్రితో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు. ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థకు చెందిన వాణిజ్య ప్రకటనలో తండ్రీకూతుర్లు కలిసి నటించినట్టు తెలుస్తోంది.

ఈ ప్రకటనలో అమితాబ్ వృద్ధుడిగా, సాధారణ మహిళగా శ్వేతాబచ్చన్ కనిపించారు. జులై నుంచి ఈ ప్రకటన ప్రసారం కానుందని సమాచారం. సెట్ లో అమితాబ్, శ్వేతకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారాయి.  కాగా, 1997లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నిఖిల్ నందతో ఆమె వివాహం జరిగింది. నిఖిల్-శ్వేత దంపతులకు ఇద్దరు పిల్లలు.  

More Telugu News