rajanikanth: సెన్సార్ పూర్తి చేసుకున్న 'కాలా'

  • పా రంజిత్ దర్శకత్వంలో 'కాలా'
  • న్యూ లుక్ తో రజనీకాంత్ 
  • ఆయన సరసన హుమా ఖురేషి

రజనీకాంత్ కథానాయకుడిగా పా రంజిత్ 'కాలా' సినిమా చేశాడు. ధనుష్ నిర్మించిన ఈ సినిమాలో రజనీ సరసన హుమా ఖురేషి నటించింది. 'కబాలి'లో రజనీకాంత్ ను కొత్తగా చూపించి మంచి మార్కులు కొట్టేసిన పా రంజిత్, ఈ సినిమాలోనూ రజనీకాంత్ ను న్యూ లుక్ లో చూపిస్తున్నాడు. ఇంతకుముందు రజనీ చేసిన మాఫియా లీడర్ పాత్రే అయినప్పటికీ, పూర్తి డిఫరెంట్ గా ఈ పాత్రను మలిచాడని అంటున్నారు.తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాతో రజనీకాంత్ కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమంటూ ఆయన అభిమానులు బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. వచ్చేనెల 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.     

More Telugu News