kcr: కుమారస్వామిని అభినందించి.. వెంటనే తిరిగిరానున్న కేసీఆర్

  • సాయంత్రం బెంగళూరుకు వెళుతున్న కేసీఆర్
  • రాత్రికి హైదరాబాదుకు తిరుగుపయనం
  • రేపటి వరకు బెంగుళూరులో ఉండలేకపోతున్న సీఎం

కర్ణాటక ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న హెచ్.డి. కుమారస్వామిని అభినందించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సాయంత్రం బెంగుళూరుకు వెళుతున్నారు. ఈ సందర్భంగా దేవెగౌడతో కూడా ఆయన సమావేశం కానున్నారు. అనంతరం ఈ రాత్రికే ఆయన హైదరాబాదుకు తిరిగి వస్తారు.

 రేపు కొన్ని అత్యవసర సమావేశాలు ఉన్నందున... కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగేంత వరకు ఆయన బెంగుళూరులో ఉండలేకపోతున్నారు. ఈ సాయంత్రం బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బెంగళూరుకు వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు కూడా బెంగళూరుకు వెళుతున్నారు. 

More Telugu News