kidambi srikanth: స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ధోనీ.. ఉబ్బితబ్బిబ్బయిన కిడాంబి శ్రీకాంత్

  • బెస్ట్ విషెస్ చెబుతూ, సంతకం చేసిన బ్యాట్ బహూకరణ
  • ఆనందాన్ని మాటల్లో చెప్పలేనన్న శ్రీకాంత్
  • ధోనీకి వీరాభిమానినని పలు సందర్భాల్లో చెప్పిన స్టార్ షట్లర్

భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ కు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఓ ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చాడు. బెస్ట్ విషెస్ టు శ్రీకాంత్ అని రాసున్న తన బ్యాటును బహూకరించాడు. ఈ విషయాన్ని శ్రీకాంత్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 'అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ధోనీ. నీ బహుమతితో నేను ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను' అంటూ  ట్వీట్ చేశాడు.
ధోనీకి అభిమానుల్లో సామాన్యులే కాదు, సెలబ్రిటీలు సైతం ఉన్నారు. ధోనీని అమితంగా అభిమానించే వారిలో కిడాంబి శ్రీకాంత్ కూడా ఒకరు. ధోనీకి తాను పెద్ద అభిమానిని అంటూ అనేక సందర్భాల్లో శ్రీకాంత్ చెప్పాడు.

More Telugu News