anjali: అంజలి ప్రధాన పాత్రగా మరో హారర్ మూవీ

  • ద్విభాషా చిత్రంలో అంజలి 
  • త్రీడీలో హారర్ కథా నేపథ్యం
  • గతంలో అంజలి ఖాతాలో 'గీతాంజలి'  

ఇటీవల కాలంలో హీరో సిద్ధార్థ్ మూడు భాషల్లో విడుదల చేసిన హారర్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూడు భాషల్లోను ఈ సినిమాకి మంచి వసూళ్లు దక్కాయి. దాంతో కొంతమంది దర్శక నిర్మాతలు మళ్లీ హారర్ మూవీలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే అంజలి కథానాయికగా ఒక హారర్ మూవీ రూపొందుతోంది.

 తెలుగు .. తమిళ భాషల్లో రూపొందిస్తోన్న ఈ సినిమాకి 'లిసా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తెలుగు ... తమిళ భాషలపై అంజలికి మంచి పట్టు వుంది. ఈ రెండు భాషల్లోను ఆమెకి మంచి క్రేజ్ వుంది. అంతే కాకుండా గతంలో ఆమె చేసిన 'గీతాంజలి' వంటి హారర్ మూవీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. త్రీడీ హారర్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా ద్వారా రాజు విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

More Telugu News