Balakrishna: బాలయ్య కోసం రంగంలోకి పరుచూరి బ్రదర్స్

  • వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ
  • మాస్ ఆడియన్స్ ఆశించే కథా నేపథ్యం
  • ఈ నెల చివరిలో ఆరంభం  

ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా సమయం ఉండటంతో, ఈలోగా వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి బాలకృష్ణ సిద్ధమవుతున్నాడు. సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన గానీ .. 27వ తేదీన గాని ఆరంభించనున్నారు. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ .. వినాయక్ మార్క్ కి తగినట్టుగానే ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చుతున్నట్టు తెలుస్తోంది. గతంలో బాలకృష్ణ చేసిన చాలా సినిమాలకి పరుచూరి బ్రదర్స్ పనిచేశారు .. ఆ సినిమాల సక్సెస్ లో ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ సారి కూడా బాలకృష్ణ సినిమాకి పరుచూరి రాసే డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయనీ .. బాలకృష్ణ అభిమానుల చేత విజిల్స్ వేయిస్తాయని అంటున్నారు.    

More Telugu News