India: పాక్‌లో కృష్ణుడి ఆలయానికి పునర్వైభవం.. రూ.2 కోట్ల కేటాయింపు

  • పాక్ హిందువులకు శుభవార్త
  • శ్రీకృష్ణుడి ఆలయ పునరుద్ధరణకు నిధుల కేటాయింపు
  • త్వరలో పనులు ప్రారంభం

పాకిస్థాన్‌లో నివసిస్తున్న హిందువులకు ఇది శుభవార్తే. రావల్పిండి-ఇస్లామాబాద్ జంట నగరాల్లో ఉన్న శ్రీకృష్ణుడి ఆలయ పునరుద్ధణకు అక్కడి పంజాబ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆలయ పునరుద్ధరణకు రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. ఈ నిధులతో త్వరలోనే పునరుద్ధరణ పనులు ప్రారంభించనున్నారు. పండుగ సమయాల్లో హిందువులు అధిక సంఖ్యలో హాజరైనప్పటికీ ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోనున్నారు.

చట్టసభకు చెందిన ఓ ప్రతినిధి అభ్యర్థన మేరకు ఆలయ పునరుద్ధరణకు నిధులు కేటాయించినట్టు స్థానిక పత్రిక పేర్కొంది. పనులు ప్రారంభించడానికి ముందు ఆలయంలోని విగ్రహాలను రెండు గదుల్లో భద్రపరిచారు. ఆలయ పునరుద్ధరణ తర్వాత పూజలు చేసుకునేందుకు ఎక్కువమంది భక్తులకు అవకాశం కలుగుతుందని ఓ అధికారి తెలిపారు. ఇక్కడి కృష్ణుడి ఆలయాన్ని కాంజీమాల్, ఉజాగర్ మాల్ రామ్ రాచ్చాల్‌లు 1897లో నిర్మించారు.

More Telugu News