Tollywood: ఆ పార్టీలో ఎవరినీ చేరొద్దని చెప్పిన నేనే చేరాల్సి వచ్చింది!: సినీనటుడు కృష్ణంరాజు

  • నాడు పీఆర్పీలో ఎవరినీ చేరొద్దని చెప్పా
  • బీజేపీకి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరాల్సి వచ్చింది
  • మళ్లీ ఎంపీ కావాలనే దురుద్దేశంతోనే అలా చేయాల్సి వచ్చింది

నాడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) గురించి బీజేపీ నేత, టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నాటి విషయాలను ఆయన గుర్తుచేసుకున్నారు. తాను విధిరాతను ఎక్కువగా నమ్ముతానని, మన టైమ్ బాగుండనప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఎవరూ చేరొద్దని చెప్పానని, కానీ, అదే పార్టీలో తాను చేరానని, ఆపై కొన్ని రోజులకే రాజీనామా చేశానని అన్నారు. అప్పట్లో బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో ప్రజారాజ్యం పార్టీలో చేరితే మళ్లీ ఎంపీ నవుతానేమోననే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

అసలు, అప్పుడేమి  జరిగిందో తనకు అర్థం కాలేదని, ఎంపీ అయిపోవాలనే దురుద్దేశం, దుర్మార్గపు ఆలోచనలతోనే ఆ పార్టీలో చేరాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. కాగా, నాడు ప్రజారాజ్యం పార్టీలో చేరటానికి ముందు ఆయన బీజేపీలో ఉన్నారు. కేంద్రమంత్రిగా కూడా ఆయన పనిచేశారు. వాజ్ పేయి హయాంలో బీజేపీకి గుడ్ బై చెప్పిన కృష్ణంరాజు.. ‘ప్రజారాజ్యం’లో చేరిన కొన్నిరోజులకే బయటకు వచ్చేశారు.  

More Telugu News