సినీ నటుడు ఉత్తేజ్ వస్త్ర దుకాణంలో చోరీ!

20-05-2018 Sun 11:39
  • హైదరాబాద్ లో డిజైనర్ స్టోర్ నిర్వహిస్తున్న ఉత్తేజ్  
  • కస్టమర్ల మాదిరి వచ్చి దొంగతనం
  • కేసు నమోదు చేసిన పోలీసులు
తెలుగు సినీ నటుడు ఉత్తేజ్, హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో అలంకార్ డిజైనర్స్ పేరిట వస్త్ర దుకాణం నిర్వహిస్తుండగా, షాపులోకి వచ్చిన మహిళలు మూడు ఖరీదైన చీరలు దొంగిలించుకు పోయారు. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, ఉత్తేజ్ భార్య పద్మావతి షాపులో ఉండగా, నిన్న సాయంత్రం ముగ్గురు మహిళలు వచ్చారు. చీరలు కొంటున్నట్టు నటించి, పద్మావతి దృష్టిని మరల్చి రూ. 80 వేల విలువైన చీరలను దొంగిలించుకుపోయారు. ఈ విషయాన్ని ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉత్తేజ్, షాపులోని సీసీటీవీ ఫుటేజ్ ని అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ మహిళలు ఎవరన్న విషయమై ఆరా తీస్తున్నారు.