trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా పేరు 'అరవింద సమేత...వీరరాఘవ'.. ఫస్ట్ లుక్ విడుదల!

  • కొత్త సినిమాలో ఎన్టీఆర్‌ లుక్ అదుర్స్‌
  • సిక్స్ ప్యాక్ బాడీతో ఎన్టీఆర్ 

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా టైటిల్ విషయంలో సస్పెన్స్ వీడింది. ఈ చిత్రానికి 'అరవింద సమేత...వీరరాఘవ' అని టైటిల్ని ఖరారు చేశారు. ఈ విషయాన్ని సినిమా యూనిట్ ఈ రోజు ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది.

ఇక మొట్టమొదటి సారిగా సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ఎన్టీఆర్ ఇందులో అదరగొట్టేశాడు. ఈ లుక్ లో ఎన్టీఆర్‌ చాలా స్టైలిష్‌గా కండలవీరుడిగా కనపడుతున్నాడు. ఇటీవల జిమ్‌లో కసిగా వ్యాయామం చేస్తోన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎట్టకేలకు ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌తో కనపడుతున్నట్లు స్పష్టం అయింది.  

More Telugu News