యడ్యూరప్ప రాజీనామా.. ఇక కాబోయే సీఎం కుమారస్వామి!

19-05-2018 Sat 16:12
  • మ్యాజిక్ ఫిగర్ ను సాధించలేకపోయిన బీజేపీ
  • బలపరీక్షను ఎదుర్కోకుండానే రాజీనామా చేసిన యడ్డీ
  • నిరాశలో బీజేపీ.. ఆనందంలో జేడీఎస్, కాంగ్రెస్
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పదవికి రాజీనామా ప్రకటించారు. బలపరీక్షకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు తనకు లభించకపోవడంతో ఆయన రాజీనామా చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. అనంతరం సభ నుంచి ఆయన బయటకు వెళ్లిపోయారు. ఇక్కడి నుంచి ఆయన నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి, గవర్నర్ కు రాజీనామాను సమర్పించనున్నారు.

ఈ నేపథ్యంలో, ఈసారి కూడా యడ్డీకి అదృష్టం దక్కలేదనే చెప్పుకోవాలి. కేవలం మూడు రోజులకే ఆయన సీఎం పదవి ముగిసింది. బలపరీక్ష కూడా జరగకుండానే, యడ్డీ రాజీనామా చేయడం గమనార్హం. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి పదవీబాధ్యతలను చేపట్టబోతున్నారు.