karnataka: సుప్రీంకోర్టు తీర్పును మేము అంగీకరించడానికి కారణం ఇదే!: కపిల్ సిబల్

  • ప్రొటెం స్పీకర్ ను మార్చాలంటే.. బలపరీక్ష వాయిదా పడుతుంది
  • ఈరోజు బలపరీక్ష జరగాలని మేము కోరుకుంటున్నాం
  • బలపరీక్షను ప్రత్యక్షప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం సంతోషకరం

కర్ణాటక ప్రొటెం స్పీకర్ గా బోపయ్యను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ స్పందించారు. ప్రొటెం స్పీకర్ ను మార్చాలంటే ఆయనకు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, దీంతో, సాయంత్రం జరగాల్సిన బలపరీక్ష వాయిదా పడుతుందని... అది తమకు ఇష్టం లేదని, అందుకే సుప్రీం తీర్పును స్వాగతించామని చెప్పారు.

బలపరీక్ష ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు జరగాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. అయితే బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తమకు సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల బలపరీక్ష పారదర్శకంగా జరగుతుందని అన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపై సిబల్ విమర్శలు గుప్పించారు. 'అవినీతి చేయను.. చేయించను' అని మోదీ పదేపదే చెబుతుంటారని... కానీ 'ఎమ్మెల్యేలను కొనను.. కొనమని చెప్పను' అని మాత్రం ఎన్నడూ చెప్పరని ఎద్దేవా చేశారు. 

More Telugu News