America: అమెరికా స్కూల్లో తుపాకీ మోత.. 10 మంది మృతి

  • ఆయుధాలతో తరగతి గదిలోకి ప్రవేశించిన విద్యార్థి
  • విచక్షణ రహితంగా కాల్పులు
  • నిందితుడి నుంచి మారణాయుధాలు స్వాధీనం

అమెరికాలోని ఓ స్కూల్లో మరోమారు తుపాకీ గర్జించింది. 9 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడిని పొట్టనపెట్టుకుంది. శుక్రవారం ఉదయం స్కూలు ప్రారంభమైన కాసేపటికే ఆయుధాలతో వచ్చిన విద్యార్థి తరగతి గదిలోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. పదిమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా ఓ పోలీసు అధికారి సహా 12 మంది గాయపడ్డారు.

ప్రధాన నిందితుడితోపాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రైఫిల్, పిస్టల్, షాట్‌గన్, పైప్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదిలో ఇది 22వ కాల్పుల ఘటన కాగా, గత వారం రోజుల్లో మూడోదని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. కాల్పులకు గల కారణాలను ఆరా తీస్తున్నట్టు చెప్పారు. విషయం తెలిసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

More Telugu News