sensex: వరుసగా నాలుగో రోజూ నష్టపోయిన స్టాక్ మార్కెట్లు!

  • కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
  • 301 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 
  • 86 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

చమురు ధరలకు తోడు కర్ణాటక రాజకీయ పరిణామాల ప్రభావం ఈరోజు స్టాక్ మార్కెట్లపై పడటంతో కుప్పకూలాయి. వరుసగా నాలుగో రోజు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 301 పాయింట్లు నష్టపోయి 34,484 పాయింట్ల వద్ద, నిఫ్టీ 86 పాయింట్లు నష్టపోయి 10,596 పాయింట్ల వద్ద ముగిశాయి.

లాభపడ్డ షేర్ల విషయానికొస్తే.. కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందూస్థాన్ యునిలివర్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ తదితర సంస్థల షేర్లు లాభాలు ఆర్జించాయి. టాటా మోటార్స్, సిప్లా, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, విప్రో మొదలైన సంస్థల షేర్లు నష్టపోయాయి. 

More Telugu News