raviteja: మాస్ ఆడియన్స్ కోసం ముస్తాబైన 'నేల టిక్కెట్టు' .. సెన్సార్ పూర్తి

  • కల్యాణ్ కృష్ణ తాజా చిత్రంగా 'నేల టిక్కెట్టు'
  • రవితేజ జోడీగా మాళవిక శర్మ 
  • ఈ నెల 25వ తేదీన భారీ రిలీజ్

రవితేజ కథానాయకుడిగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన 'నేల టిక్కెట్టు' విడుదలకి ముస్తాబైంది. ఈ నెల 25వ తేదీన విడుదలవుతోన్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాలో మాళవిక శర్మ కథానాయికగా నటించింది.

మాస్ ఆడియన్స్ తో పాటు యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా కల్యాణ్ కృష్ణ  కంటెంట్ ను రెడీ చేయడం విశేషం. ఈ సినిమా రవితేజ ఖాతాలోకి మరో సూపర్ హిట్ గా చేరిపోవడం ఖాయమనే నమ్మకాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకి మాళవిక శర్మ పరిచయమవుతోంది. ఈ సుందరి కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.     

More Telugu News