actor sridevi death: శ్రీదేవి మరణం పథకం ప్రకారం హత్యే: స్వతంత్రంగా దర్యాప్తు చేస్తున్న ఓ మాజీ పోలీసు అధికారి సందేహం

  • బాత్ టబ్ లో ఊపిరి ఆడకుండా ఎవరిని అయినా చేయవచ్చు
  • దాన్ని సాక్ష్యం లేని హత్యగానూ చిత్రీకరించొచ్చు
  • ఆమె హత్య అనంతరం ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి
  • వాటికి సమాధానాలు చెప్పాల్సి ఉంది

నటి శ్రీదేవి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోలేదని, ఆమెది పథకం ప్రకారం జరిగిన హత్యేనంటున్నారు రిటైర్డ్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ వేద్ భూషణ్. ఢిల్లీ కేంద్రంగా ప్రైవేటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని నిర్వహిస్తున్న ఆయన శ్రీదేవి మరణంపై స్వతంత్రంగా దర్యాప్తు చేస్తున్నారు. దుబాయిలోని హోటల్ జుమేరా ఎమిరేట్స్ లో ఫిబ్రవరి 24న శ్రీదేవి బాత్ టబ్ లో మునిగి చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందినట్టు దర్యాప్తు అధికారులు తేల్చారు. ఆమె శరీరంలో ఆల్కహాల్ నమూనాలు ఉన్నాయని, నిస్సందేహంగా ఆమె మరణం ప్రమాదవశాత్తూ జరిగిందేనని ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా స్పష్టం చేశారు.

అయితే, వీటితో వేద్ భూషణ్ ఏకీభవించడం లేదు. ‘‘ఎవరిని అయినా బాత్ టబ్ లో బలవంతంగా ఊపిరి ఆగిపోయే వరకు నిలువరించొచ్చు. సాక్ష్యం లేకుండా చేయవచ్చు. దాన్ని ప్రమాదవశాత్తూ మరణంగా చిత్రీకరించొచ్చు. చూడ్డానికి ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగానే ఉంది’’ అని వేద్ భూషణ్ పేర్కొన్నారు. తన దర్యాప్తులో భాగంగా శ్రీదేవి మృతి చెందిన దుబాయిలోని హోటల్ కు వేద్ భూషణ్ వెళ్లి పరిశీలించారు. అయితే శ్రీదేవి బస చేసిన గదిలోకి మాత్రం అనుమతించలేదు. పక్క గదిలో ఉండి ఆయన ఏం జరిగి ఉంటుందన్న దానిపై ఓ అవగాహనకు వచ్చారు. కొన్ని అదృశ్య శక్తులు పనిచేశాయని, ఆమె మరణం తర్వాత వ్యక్తమైన సందేహాలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

More Telugu News