ఐపీఎల్‌లో బాసిల్ థంపి చెత్త రికార్డు.. ఇషాంత్ శర్మ రికార్డు బద్దలు!

18-05-2018 Fri 07:51
  • థంపి బౌలింగ్‌ను చీల్చి చెండాడిన బెంగళూరు బ్యాట్స్‌మెన్
  • అత్యధిక పరుగులు సమర్పించుకున్న రికార్డు
  • 4 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చుకున్న వైనం

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫాస్ట్ బౌలర్ బాసిల్ థంపి చెత్త రికార్డును నెలకొల్పాడు. గత సీజన్‌లో ఎమర్జింగ్ ప్లేయర్‌గా అవార్డు అందుకున్న థంపి గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పరుగులు ధారాళంగా సమర్పించుకున్నాడు. నాలుగు ఓవర్లు వేసిన థంపి ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

గతంలో ఇషాంత్ శర్మ పేరిట ఈ రికార్డు ఉండేది. 2013లో ఇషాంత్ నాలుగు ఓవర్లు వేసి 66 పరుగులు ఇచ్చాడు. ఇప్పుడా రికార్డును థంపి అధిగమించాడు. 65 పరుగులతో ఉమేశ్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నాడు.