Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కొత్తతరహా పాత్రలో నయనతార 
  • భారీ ఆఫర్ ను తిరస్కరించిన ప్రభాస్ 
  • వెంకటేశ్ భార్యగా తమన్నా!
  • అదంతా పుకారన్న దర్శకుడు తేజ

*  నయనతార ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న హీరోయిన్ ప్రధాన చిత్రం 'కొలమావు కోకిల'. ఇందులో ఆర్థిక సమస్యల కారణంగా ఆమె డ్రగ్స్ సరఫరా చేసే (డ్రగ్ పెడ్లర్) యువతి పాత్రను పోషిస్తోందట.
*  'బాహుబలి' సినిమాతో బాలీవుడ్ లో కూడా ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఓ భారీ ఆఫర్ ను తిరస్కరించినట్టు సమాచారం. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జొహార్ తన చిత్రంలో నటించాల్సిందిగా ఇచ్చిన భారీ ఆఫర్ ను ప్రభాస్ రిజక్ట్ చేశాడట.
*  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' పేరిట ఓ మల్టీ స్టారర్ రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో వెంకీ సరసన తమన్నా, వరుణ్ పక్కన మెహ్రీన్ నటిస్తున్నారు. కాగా, ఇందులో వెంకీ, తమన్నా జంట భార్యాభర్తలుగా కనిపిస్తారట.
*  చిన్న వయసులోనే మరణించిన హీరో ఉదయ్ కిరణ్ జీవితకథను దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్నట్టు ఇటీవల వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై దర్శకుడు తేజ స్పందించారు. ఉదయ్ కిరణ్ బయోపిక్ తీసే ఉద్దేశం తనకు లేదని, అసలు ఈ వార్తను ఎవరు పుట్టించారో తనకు తెలియదని వివరణ ఇచ్చారు.

More Telugu News