yaddyurappa: నలుగురు ఐపీఎస్‌లను బదిలీ చేశారు.. యడ్యూరప్ప ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తోంది: కుమారస్వామి

  • మా ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించడం మా బాధ్యత
  • ఆ పనిలో ఉంటాం
  • బీజేపీ తీరు హాస్యాస్పదం

కాంగ్రెస్‌, జేడీఎస్‌లు ఉన్న హోటళ్ల వద్ద పోలీసు బందోబస్తును తొలగిస్తూ కర్ణాటక కొత్త సీఎం యడ్యూరప్ప కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించిన జేడీఎస్‌ నేత కుమారస్వామి.. యడ్యూరప్ప ప్రవర్తిస్తోన్న తీరు చూస్తోంటే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించడం తమ బాధ్యతని, తాము ఆ పనిలో ఉంటామని తెలిపారు.

యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్‌లను బదిలీ చేశారని విమర్శించారు. బీజేపీ తీరు హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. కాగా, కుమారస్వామి తండ్రి జేడీఎస్‌ అధినేత దేవెగౌడ.. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఫోన్‌ చేశారు. ఇరువురు నేతలు కర్ణాటక రాజకీయాలపై చర్చలు జరిపారు. 

More Telugu News