TTD: 'ఇది సరైంది కాదు'.. టీటీడీలో అర్చకుల రిటైర్మెంట్ వివాదంపై వైఎస్ జగన్ ఆగ్రహం

  • అర్చకులపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు
  • వారికి పదవీ విరమణ ప్రకటించడం సరైంది కాదు
  • అసలు రిటైర్మెంట్ ప్రకటించడంలో అర్థమే లేదు

టీటీడీలో అవినీతి, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలను ప్రశ్నించినందుకు అర్చకులపై కక్ష సాధింపునకు పాల్పడి, వారికి పదవీ విరమణ ప్రకటించడం సరైంది కాదని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన ట్విట్టర్‌ ద్వారా ఈ విషయంపై స్పందిస్తూ.... టీటీడీ ప్రధాన అర్చకుడు తెలిపిన విషయాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార దాహం మరోసారి వెల్లడైందని ఆరోపించారు.

పదోన్నతితో కూడిన పే స్కేలు, పదవి వదిలిపెట్టిన తరువాత ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వనప్పుడు, ఉద్యోగిగా పరిగణించనప్పుడు, వారికి ప్రభుత్వం రిటైర్మెంట్ ప్రకటించడంలో అర్థం లేదని జగన్‌ ట్వీట్‌ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.                                                                 

More Telugu News