rjd: బీహార్‌లో మాదే అతిపెద్ద పార్టీ.. రేపు గవర్నర్‌ వద్దకు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించమంటాం: తేజస్వి యాదవ్

  • అమిత్‌ షా వద్ద ఓ ఫార్ములా ఉంది
  • ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బేరసారాలాడతారు
  • లేదంటే సీబీఐ, ఈడీలను ఎమ్మెల్యేల వద్దకు పంపుతారు
  • రేపు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో కూడా బీజేపీ ఇలాగే చేస్తుంది

కర్ణాటకలో ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం మెజార్టీని ఎలా నిరూపించుకుంటుందని బీహార్‌ ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.... బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా వద్ద ఓ ఫార్ములా ఉందని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బేరసారాలాడతారు లేకపొతే సీబీఐ, ఈడీలను సదరు ఎమ్మెల్యేల వద్దకు పంపుతారని అన్నారు.

ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ఏకం కాకపోతే బీజేపీ తీరు ఎప్పటికీ ఇలాగే ఉంటుందని, నిన్న బీహార్‌, ఈరోజు కర్ణాటక వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో కూడా బీజేపీ ఇలాగే చేస్తుందని తేజస్వి యాదవ్‌ అన్నారు. రేపు తాము తమ రాష్ట్ర గవర్నర్‌ని కలుస్తామని, కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినట్లే బీహార్‌లో అతిపెద్ద పార్టీగా ఉన్న తమను కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరతామని, ప్రస్తుత గవర్నమెంటును రద్దు చేయాలని అడుగుతామని ప్రకటించారు.     

More Telugu News