Twitter: వాట్‌ ఏ ట్విస్ట్‌.. కర్ణాటక రాజకీయాలపై మంచు విష్ణు ఆసక్తికర ట్వీట్‌

  • విష్ణు హీరోగా 'ఓటర్' సినిమా
  • కర్ణాటక తీర్పు తన సినిమాలాగే ఉందంటూ ట్వీట్
  • జీఎస్‌ కార్తీక్‌ దర్శకత్వంలో 'ఓటర్‌'

కర్ణాటకలో 104 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కించుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరో రెండు వారాల్లో బల నిరూపణ ఎదుర్కోవాల్సి ఉంది. అయితే, ఆ రాష్ట్ర రాజకీయాలపై, నేతలపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా తెలుగు సినీనటుడు మంచు విష్ణు కూడా ఆ రాష్ట్ర రాజకీయాలపై ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఆయన ‘ఓటర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో తాజాగా మంచు విష్ణు మాట్లాడుతూ... ‘వాట్‌ ఏ ట్విస్ట్‌ సర్‌ జీ... కర్ణాటక తీర్పు ఇంచుమించు ‘ఓటర్’ సినిమాలాగే ఉంది’ అని పేర్కొన్నాడు. విష్ణు చేసిన ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. 'ఓటర్‌' సినిమా కథ కూడా కర్ణాటక రాజకీయాలలాగే ఉంటుందా? అని నెటిజన్లు ప్రశ్నలు వేసుకుంటున్నారు. ఈ సినిమాకు జీఎస్‌ కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

More Telugu News