vijay antony: 'కాశి' పైనే విజయ్ ఆంటోని ఆశలు

  • విజయ్ ఆంటోని హీరోగా 'కాశి'
  • తెలుగు .. తమిళ భాషల్లో రిలీజ్ 
  • నాయికలుగా అంజలి .. సునయన

'బిచ్చగాడు' అనే ఒకే ఒక సినిమాతో తెలుగులో విజయ్ ఆంటోని ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా ఇక్కడ భారీ వసూళ్లను సాధించడమే కాదు .. విజయ్ ఆంటోని తదుపరి సినిమాల పట్ల అందరిలో ఆసక్తి పెరిగేలా చేసింది. దాంతో తన తమిళ సినిమాలు తప్పనిసరిగా తెలుగులోనూ విడుదలయ్యేలా చూసుకుంటూ వస్తున్నాడు.

 అలా ఆ తరువాత వచ్చిన 'భేతాళుడు' .. 'ఇంద్రసేన' సినిమాలు ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రం తమిళంలో 'కాళి ' పేరుతోనూ .. తెలుగులో 'కాశి' పేరుతోనూ ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తప్పకుండా తనకి హిట్ తెచ్చిపెడుతుందనే ఆశతో విజయ్ ఆంటోని వున్నాడు. కృతుంగ ఉదయనిధి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంజలి .. సునయన కథానాయికలుగా కనిపించనున్నారు.     

More Telugu News