aadhaar: పెన్షన్ కోసం ఆధార్ అక్కర్లేదు... స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

  • ఆధార్ అదనపు సదుపాయం మాత్రమే
  • బ్యాంకు వరకు వెళ్లకుండానే లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకే
  • స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్

కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట. పెన్షన్ పొందేందుకు ఆధార్ నంబర్ అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ అన్నది లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు బ్యాంకుల వరకు వెళ్లనవసరం లేకుండా టెక్నాలజీ వినియోగానికి ఆధార్ అదనపు సదుపాయం మాత్రమేనని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు.
 
48.41 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా, 61.17 లక్షల మంది పెన్షనర్లు కూడా ఉన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని మంత్రి చెప్పారు. కనీస పెన్షన్ రూ.9,000కు పెంచామని, గ్రాట్యుటీ పరిమితిని రూ.20 లక్షలు చేశామని, నెలవారీ వైద్య అలవెన్స్ ను రూ1,000గా ఫిక్స్ చేశామని వివరించారు.

More Telugu News