Karnataka: ఎన్నికల ముందే కలిసుంటే కాంగ్రెస్-జేడీఎస్ కు బంపర్ మెజారిటీ వచ్చి వుండేది!

  • కాంగ్రెస్-జేడీఎస్ కు 150 స్థానాలు వచ్చి ఉండేవి
  • బీజేపీ 69కి పరిమితమయ్యేది
  • లోక్ సభ ఎన్నికలకు పొత్తు పెట్టుకున్నా మంచి ఫలితాలకు అవకాశం

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ఎన్నికల ముందే కలసి పోటీ చేసి ఉంటే తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉండేది. ఈ విషయం ఎవరో చెప్పక్కర్లేదు. ఎవరికి వారే ఓట్ల గణాంకాలు పరిశీలిస్తే తేలిపోయే విషయం ఇది. ఎన్నికల ముందు కలిసి ఉంటే కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి 150 సీట్లు వచ్చి ఉండేవి. బీజేపీ కేవలం 69 సీట్లకు పరిమితమయ్యేది. కాంగ్రెస్ ఇప్పుడు 78 గెలుచుకోగా, కలసి పోటీ చేస్తే 99 స్థానాలు, జేడీఎస్ కు 37కు బదులు 51 సీట్లు వచ్చి ఉండేవి.

ముఖ్యమైన అంశం ఏమిటంటే, రానున్న లోక్ సభ ఎన్నికల కోసమైనా కాంగ్రెస్-జేడీఎస్ కలసి పోటీచేస్తే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో మాదిరే ఓటర్ల ప్రాధాన్యం మారకుండా ఉంటే కాంగ్రెస్-జేడీఎస్ కూటమి 28 లోక్ సభ స్థానాల్లో 17 సొంతం చేసుకోగలదు. బీజేపీ కేవలం 7 సీట్లకు పరిమితం అవుతుంది.

More Telugu News