Ramadan: కనిపించిన చంద్రవంక.. నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం

  • రాత్రి ఎనిమిది గంటలకు కనిపించిన చంద్రవంక
  • శుభాకాంక్షలు చెప్పుకున్న ముస్లింలు
  • రంజాన్ శుభసూచకంగా తరావీ నమాజ్

బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆకాశంలో చంద్రవంక కనిపించడంతో ముస్లింలు సంబరాలు చేసుకున్నారు. ‘చాంద్ ముబారక్’ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆకాశంలో నెలవంక కనిపించిన వెంటనే చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని మసీదుల నుంచి రంజాన్ మాసం ప్రారంభ సైరన్ మోతలు వినిపించాయి.

ఆకాశంలో రంజాన్ మాసం చంద్రవంక కనిపించిందని రూహిత్ ఇలాల్‌ కమిటీ ప్రతినిధులు ప్రకటించడంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభ సూచకంగా మక్కా మసీదులో తరావీ నమాజ్ నిర్వహించారు. ప్రార్థనల్లో వేలాది మంది ముస్లింలు పాల్గొన్నారు. రంజాన్ మాసం ప్రారంభ సూచకంగా జంట నగరాల్లో ప్రార్థనలు నిర్వహించారు. నేటి (గురువారం) నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి.

More Telugu News